Thursday 18th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీ ఒక ‘టోటల్ కిల్లర్’.. ట్రంప్ సంచలన ప్రశంసలు!

మోదీ ఒక ‘టోటల్ కిల్లర్’.. ట్రంప్ సంచలన ప్రశంసలు!

Donald Trump Praises PM Narendra Modi | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పూర్తి భరోసా ఇస్తూ, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు.

జీ-7 (G7) దేశాల సదస్సు సందర్భంగా మోదీ-ట్రంప్ మధ్య జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ అనంతరం ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్‌లో తాను ఉన్నంత కాలం భారతదేశానికి అత్యంత నమ్మకమైన, మంచి మిత్రుడు ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది..

ప్రధాని మోదీతో ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారతదేశంపై ఎలాంటి దాడి జరిగినా అమెరికా కచ్చితంగా సహాయం చేయడానికి ముందుంటుందని ట్రంప్ హామీ ఇచ్చారు.

ముఖ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నంత వరకు భారత్‌కు తమ పూర్తి రాజకీయ, రక్షణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ తనకు చిరకాల మిత్రుడని, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో తాము మరింత విస్తృతంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

మోదీ చాలా మంచివారు.. కానీ కొన్ని విషయాల్లో ‘కిల్లర్’..

సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ నవ్వులు పూయించారు.

“నరేంద్ర మోదీ బయటకు చూడటానికి దైవదూతలా చాలా శాంతంగా, చక్కగా కనిపిస్తారు. కానీ వ్యాపారాలు, దేశ ప్రయోజనాల విషయాల్లో బేరసారాలు చేయాల్సి వస్తే మాత్రం ఆయన అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు.

కొన్ని విషయాల్లో మోదీ ఒక ‘టోటల్ కిల్లర్’. తన దేశం కోసం దేనినైనా సాధించుకోగల సమర్థుడు.” అని  ట్రంప్ కితాబిచ్చారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ రాజకీయాలు మరియు గ్లోబల్ ఎకానమీలో భారతదేశం అత్యంత కీలకమైన, పెద్ద పాత్ర పోషిస్తూనే ఉంటుందని ట్రంప్ శ్లాఘించారు. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల భేటీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions