Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > లక్షల జీతం.. అయినా వీకెండ్స్‌ లో ‘ర్యాపిడో’ డ్రైవర్!

లక్షల జీతం.. అయినా వీకెండ్స్‌ లో ‘ర్యాపిడో’ డ్రైవర్!

‌- సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ స్టోరీ వైరల్!

Software Engineer Works As Rapido Driver | చేతినిండా ఐటీ ఉద్యోగం.. నెలకు లక్షకు పైగా జీతం.. అయినా సరే మెట్రో నగరాల్లో కుటుంబ పోషణ భారం కావడంతో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీకెండ్స్‌లో ‘ర్యాపిడో’ (Rapido) బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు.

 బెంగళూరు వంటి మహానగరాల్లో జీవన వ్యయం ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టే ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

షాబాజ్ బుకింగ్‌తో వెలుగులోకి..
ఇటీవల షాబాజ్ అనే నెటిజన్ బెంగళూరులోని బన్నెరఘట్టకు వెళ్లేందుకు ఒక ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. ప్రయాణ సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో మాటలు కలిపిన షాబాజ్, ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఐటీ ఉద్యోగిగా గుర్తింపు..
 సదరు ర్యాపిడో డ్రైవర్ తాను ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌ వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నానని, నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువే జీతం వస్తుందని చెప్పారు.

తనకు పెళ్లై పిల్లలు ఉన్నారని, అయితే ప్రస్తుతం ఉన్న విపరీతమైన ఖర్చుల దృష్ట్యా కేవలం వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే శని, ఆదివారాలు (Weekends) ఖాళీగా ఉండకుండా కుటుంబ పోషణకు అదనపు ఆదాయం కోసం ఇలా బైక్ ట్యాక్సీ నడుపుతున్నట్లు వివరించారు.

హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి..
నెటిజన్ల కామెంట్లు ఈ హృదయ విదారక, షాకింగ్ సంభాషణను షాబాజ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకోవడంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు మెట్రో నగరాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకడం నరకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేవలం బెంగళూరులోనే కాదు.. అటు ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అప్పులు తీర్చడానికో, ఇల్లు గడవడానికో పార్ట్ టైమ్ ఉద్యోగాలు, బైక్ ట్యాక్సీలు నడుపుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.

You may also like
శాండ్‌విచ్ షాప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రోబో!
‘ఆగస్ట్ 25’న సంచలనం పేరుతో రూ.8.5 కోట్ల వసూలు?
3,400 లిప్‌స్టిక్ ముద్దులతో కార్‌ డెకరేషన్.. వైరల్ అయిన పిచ్చి ట్రెండ్!
ప్రేమలో విఫలమైతే 7 రోజులు పెయిడ్ లీవ్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions