Karnataka Lifts Ban On Hijab | కర్ణాటక విద్యాసంస్థల్లో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హిజాబ్ వివాదానికి తెరపడింది. 2022లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన యూనిఫాం ఉత్తర్వులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుంది.
విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్‌తో పాటు సాంప్రదాయ మరియు మతపరమైన చిహ్నాలను ధరించడానికి అనుమతిస్తూ బుధవారం కొత్త గెజిట్ విడుదల చేసింది.
హిజాబ్ తో పాటు యజ్ఞోపవీతం, శివధార, రుద్రాక్షలు, శరవస్త్ర వంటి మతపరమైన చిహ్నాలను ధరించడానికి విద్యార్థులకు అనుమతి లభించింది.
అయితే కాషాయ కండువాలకు మాత్రం అనుమతి నిరాకరించింది. ఇవి మతపరమైన సంప్రదాయం కిందకు రావని ప్రభుత్వం పేర్కొంది.
మతపరమైన చిహ్నాలు ధరించారనే కారణంతో ఏ విద్యార్థిని తరగతి గదిలోకి లేదా పరీక్షా హాల్లోకి రాకుండా అడ్డుకోకూడదని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు ఇలాంటి చిహ్నాలను ధరించాలని లేదా ధరించకూడదని ఎవరూ బలవంతం చేయకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది.







