- గంగమ్మ సాక్షిగా చెప్పిందే జరిగింది!
PM Modi prediction Bengal results | పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 200 పైగా స్థానాల్లో ఆధిక్యంతో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ఆసక్తికరమైన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆనాడు బీహార్ విజయసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు.. నేడు బెంగాల్ ఫలితాల్లో అక్షరాలా నిజమయ్యాయని నెటిజన్లు ఆ వీడియోను రీ-షేర్ చేస్తున్నారు.
గంగమ్మ సాక్షిగా మోదీ జోస్యం..
గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
“గంగా నది బీహార్ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుంది. బీహార్‌లో లభించిన ఈ విజయం, ఆ గంగా నదిలాగే బెంగాల్‌లో మా విజయానికి మార్గం సుగమం చేస్తుంది” అని మోదీ ఆనాడు వ్యాఖ్యానించారు.
నిజమైన అంచనా..
నాడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను టీఎంసీ తీవ్రంగా కొట్టిపారేసింది. కానీ నేడు వెలువడుతున్న ఫలితాలు మోదీ జోస్యాన్ని నిజం చేశాయి. బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ తొలిసారిగా మేజిక్ ఫిగర్‌ను దాటి 200 స్థానాల దిశగా దూసుకుపోతోంది.
దక్షిణాదిపై ప్రభావం..
కేవలం బెంగాల్ మాత్రమే కాదు, ఈ ఫలితాల ప్రభావం దక్షిణాదిపై కూడా ఉంటుందని ఆనాడే మోదీ పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే నేడు తమిళనాడు ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ డీఎంకేకు గట్టి షాక్ ఇస్తూ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండడం విశేషం.
ప్రధాని మోదీ ఆనాడు బీహార్ వేదికగా వేసిన పొలిటికల్ అంచనా నేడు బెంగాల్ ఫలితాల రూపంలో అక్షరాలా నిజం కావడంతో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి.







