Tuesday 16th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ పుకార్లను నమ్మొద్దు.. ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి!

ఆ పుకార్లను నమ్మొద్దు.. ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి!

kishan reddy slams tg assembly speaker

– ‘పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
– బంకుల వద్ద క్యూ కట్టవద్దు’:

Kishan Reddy Request to Public | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరవద్దని ఆయన కోరారు. సాధారణ రోజులతో పోలిస్తే బుధవారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఇంధన సరఫరా జరిగిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

రోజువారీ సాధారణ సగటు 6,920 కిలోలీటర్లు కాగా.. బుధవారం ఏకంగా 12,875 కిలోలీటర్లు సరఫరా అయింది. రోజువారీ సాధారణ సగటు 9,017 కిలోలీటర్లు కాగా.. బుధవారం ఏకంగా 21,295 కిలోలీటర్లు పంపిణీ జరిగింది.

డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతున్నందున, ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions