Mamata Fires On EC and BJP | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం (EC)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను, ఈవీఎంలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను గురువారం రాత్రి మమతా బెనర్జీ స్వయంగా సందర్శించి భద్రతను పరిశీలించారు.
ఇక్కడే ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచారు.
ఇతర పార్టీల ప్రతినిధులు లేకుండానే బీజేపీ, ఈసీ కుమ్మక్కై బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఒక వీడియోను ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా విడుదల చేసింది.
“ఈవీఎంలు, ఓట్ల లెక్కింపును తారుమారు చేయాలని చూస్తే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తాం” అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల ఫలితాలను మార్చేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించిన దీదీ.. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పార్టీ శ్రేణులు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉంటూ రక్షణగా ఉండాలని పిలుపునిచ్చారు.







