Tuesday 8th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

dr preeti reddy gives clarity on joingin bjp

Dr. Preeti Reddy Gives Clarity | మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటే కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి.

ఇటీవల ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, గతంలో మోదీ పాలనపై ప్రశంసలు కురిపించడం ఆవార్తలకు ఊతమించ్చింది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ఆమె స్వయంగా చెక్ పెట్టారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని ఆమె స్పష్టం చేశారు.

మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగబోయే ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రామ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించామని, ఆ క్రమంలోనే ఒక విద్యావేత్తగా తివారీని కలిశానని ఆమె తెలిపారు.

తాము కేవలం బీజేపీ నేతలనే కాకుండా, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానిస్తున్నామని, అందులో భాగంగానే మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసినట్లు గుర్తు చేశారు.

మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, తమకు ఆ పార్టీ అంటే ఎంతో గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. తనపై వస్తున్న రాజకీయ ప్రచారాలకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions