Marathon finish line fail video | ఆటలోనైనా, జీవితంలోనైనా ఫినిషింగ్ లైన్ దాటే వరకు అప్రమత్తంగా ఉండాలి. గెలుపు ముంగిట ఏమరపాటు ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుక ప్రత్యక్ష నిదర్శనం ఈ వీడియో.
అమెరికాలో జరిగిన ఒక మారథాన్ రేసులో కేవలం సెంటీమీటర్ల దూరంలో విజయం చేజారిన ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అమెరికాలో నిర్వహించిన ఓ మారథాన్ పోటీలో రన్నర్ కార్సన్ మెల్లో అందరికంటే ముందున్నాడు.
ఫినిషింగ్ లైన్ కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. గెలుపు తనదేనని నిర్ణయించుకున్న మెల్లో, ఉత్సాహంతో వేగాన్ని తగ్గించి గెలుపు సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టాడు. వెనుక ఎవరూ లేరన్న ధీమాతో పరుగును నెమ్మదించాడు.
అయితే అతడి ఏమరపాటును గమనించిన వెనక రన్నర్ జాక్సన్, తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి మెరుపు వేగంతో దూసుకొచ్చాడు. మెల్లో ఫినిషింగ్ లైన్ తాకే సరికే, జాక్సన్ అతడిని దాటుకుంటూ వెళ్లి విజేతగా నిలిచాడు.
కళ్లముందే గెలుపు చేజారడంతో కార్సన్ మెల్లో షాక్‌కు గురై తల పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “లక్ష్యం చేరే వరకు వేగం తగ్గించకూడదు” అని కొందరు, “జాక్సన్ పోరాట పటిమ అద్భుతం” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.






