Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > రామ్ చరణ్ పెద్ది విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే!

రామ్ చరణ్ పెద్ది విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే!

peddi

Peddi Release Date Postponed | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) విడుదల మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 30వ తేదీకి ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు.

ఈ మెగా మూవీని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. నిర్మాతలు తెలిపిన వివరాల ప్రకారం, సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయింది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.

ఇప్పటికే ఎడిట్ ప్రింట్ చూసుకున్న చిత్రబృందం, సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజీ పడకూడదని, ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ఎక్స్‌ పీరియన్స్‌ ను అందించడానికే టెక్నికల్ టీమ్‌కు మరికొంత సమయం కేటాయించినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో మరో భారీ ప్రాజెక్టులో నటిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.

జూన్ నెలలో ఏ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేది త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions