Chiranjeevi’s home pooja room miracle | దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఒక అరుదైన ఆధ్యాత్మిక దృశ్యాన్ని పరిచయం చేశారు.
తన నివాసంలోని పూజా మందిరంలో ప్రతి ఏటా ఆవిష్కృతమయ్యే ఒక దైవిక అద్భుతాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
చిరంజీవి తమ పూజా మందిరంలోని ఆంజనేయస్వామి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించే తీరును ఈ వీడియోలో వివరించారు.
“ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు సూర్యకిరణాలు ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల్లా మారి, మా పూజగదిలోని స్వామివారి విగ్రహాన్ని పైనుంచి కింద వరకు తాకుతాయి. ఈ దృశ్యం మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది” అని చిరంజీవి పేర్కొన్నారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై పడిన ‘సూర్య తిలకం’ను, అలాగే కోణార్క్, అరసవిల్లి వంటి పుణ్యక్షేత్రాల్లో కనిపించే అద్భుత కిరణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అలాంటి పవిత్రమైన అనుభూతి తన ఇంట్లోనే కలగడం తన అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు “జై బజరంగబలి” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. చిరంజీవిలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయనకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






