Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘అది సర్కార్ కాదు.. సర్కస్.. అసెంబ్లీలో కేటీఆర్ చిట్ చాట్!

‘అది సర్కార్ కాదు.. సర్కస్.. అసెంబ్లీలో కేటీఆర్ చిట్ చాట్!

KTR Satires On Congress Govt | తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు.

మూసీ ప్రాజెక్ట్ నుంచి రుణాల మాఫీ వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. “ఇది సర్కార్ కాదు, సర్కస్” అంటూ పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు.

రాజీనామా సవాల్: భట్టికి కేటీఆర్ డెడ్ లైన్

మంత్రి భట్టి విక్రమార్క చెబుతున్న ₹57 వేల కోట్ల వడ్డీ లేని రుణాల అంశంపై కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు.

“ప్రభుత్వం నిజంగా ₹57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని నిరూపిస్తే.. నేను ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ అది అబద్ధమైతే భట్టి గారు కానీ, సీతక్క గారు కానీ రాజీనామా చేస్తారా?” అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వారికే రాజీనామా చేసే నైతికత ఉందని స్పష్టం చేశారు.

మూసీ ప్రాజెక్ట్: “లూటీకి మాత్రమే వ్యతిరేకం”

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ దాని పేరిట జరుగుతున్న ‘లూటీ’ని అడ్డుకుంటామని కేటీఆర్ అన్నారు. “ఆరు నూరైనా పూర్తి చేస్తాం” అని వ్యాఖ్యానిస్తున్న అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

మూసీ ప్రాజెక్ట్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, వేలాది ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లే ఎఫ్‌టీఎల్ (FTL)లో ఉందని ఆరోపించారు. పాకిస్థాన్, ఏఏఐ (AAI) నిషేధించిన కంపెనీని మూసీ ప్రాజెక్ట్ కోసం ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు.

ADB రుణం & ఫార్మా సిటీ వివాదం

డీపీఆర్ (DPR) ఇవ్వకపోవడం వల్లే ఏడీబీ (ADB) రుణం మంజూరు కాలేదని, మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఫార్మా సిటీ పేరుతో తీసుకున్న భూములను ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కేసీఆర్ ఎందుకు రావడం లేదంటే?

బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద గెలిచిన వారికి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తిడుతుంటే కనీసం ఖండించని సభకు కేసీఆర్ గారు ఎందుకు వస్తారు? మా విమర్శలనే తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం, కేసీఆర్ వస్తే ఎలా తట్టుకుంటుంది?” అని ఎద్దేవా చేశారు.

తాము విసిరిన డ్రగ్స్ టెస్ట్ సవాల్‌కు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పథకాల అమలుకు నిధులు లేవని చెబుతూ, మూసీకి ₹1.5 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తారని నిలదీశారు.

You may also like
ktr speech in assembly
‘ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి?’: కేటీఆర్
ktr slams government
రాహుల్ గాంధీకి ‘వెయ్యి కోట్లు’.. రైతులకు ‘వెన్నుపోటు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions