Shivalik Reaches India | పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలకు తెరపడింది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ‘శివాలిక్’ గ్యాస్ నౌక సురక్షితంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ కు చేరుకుంది.
ఏకంగా 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి (LPG) లోడ్‌తో వచ్చిన ఈ భారీ నౌక రాకతో దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు కాస్త తీరనున్నాయి.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, యుద్ధ నౌకల పహారాలో ఉన్న హార్మోజ్ జలసంధి గుండా ఈ నౌక ప్రయాణించింది.
ఈ నౌకకు క్లియరెన్స్ లభించడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జరిపిన మెరుపు దౌత్యం కీలక భూమిక పోషించింది.
ఇరాన్ ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపి, నౌక ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భారత్ విజయం సాధించింది.






