– కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
KTR Warns Congress | మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌లకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజకీయ కక్షసాధింపుపై నిప్పులు
డ్రగ్స్ కేసును అడ్డుపెట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీ తనపై, బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
“ప్రతి డ్రగ్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే ఊరుకోను. అనవసరంగా బురదజల్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, నోటీసులు పంపుతాను” అని ఆయన హెచ్చరించారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకం: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, వాటి వాడకాన్ని తాను వ్యక్తిగతంగా, తన పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఏ పరీక్షకైనా నేను సిద్ధం’
డ్రగ్స్ వాడకాన్ని ఖండించడమే కాకుండా, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కేటీఆర్ మరోసారి కీలక ప్రకటన చేశారు. తాను ఏ రకమైన పరీక్షకైనా (Blood/Hair test) సిద్ధమని, తప్పు చేయని తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
డ్రగ్స్ కేసుకు, రాజకీయాలకు సంబంధం లేదని.. కేవలం తమను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు అసహ్యకరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
కేసు పూర్వాపరాలు..
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీపై ఈగల్ టీమ్, ఎస్ఓటీ (SOT) మరియు స్థానిక పోలీసులు మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
అక్కడ జరిపిన డ్రగ్ టెస్టుల్లో పలువురు ప్రముఖులకు పాజిటివ్ రావడంతో, ప్రస్తుతం పోలీసులు ఈ మూలాల పైన దర్యాప్తును ముమ్మరం చేశారు.







