Saturday 22nd August 2026
12:07:03 PM
Home > తాజా > బొమ్మనే తల్లి భావించి..మనసుల్ని కదిలిస్తున్న‘పంచ్’ కథ!  

బొమ్మనే తల్లి భావించి..మనసుల్ని కదిలిస్తున్న‘పంచ్’ కథ!  

punch story

Monkey Punch Story | ఈ ప్రపంచంలో ఏ జీవికైనా తల్లి ప్రేమను మించిన ఆప్యాయత ఎక్కడా దొరకదు అంటే అతిశయోక్తి లేదు.  ఏ జీవికైనా తల్లి ఒడే తన ప్రపంచం. అలా తల్లి ఒడిలో పెరగాల్సిన వయసులో ఓ చిన్న కోతి.. ఓ బొమ్మను హత్తుకుని అమ్మ కౌగిలోని వెచ్చదనాన్ని వెతుక్కుంటోంది.

జపాన్‌లోని ఓ నగరంలోని Zooలో ఈ హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. జూలో జన్మించిన ఆరు నెలల జపనీస్ మకాక్ కోతిపిల్ల ‘పంచ్’ (Punch)ను తల్లి వదిలేయడంతో జూ కీపర్లు పెంచుతున్నారు. తల్లి ఒడిలో పెరిగే అవకాశం లేకపోవడంతో పంచ్‌కు ఓ ఒరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు.

దీంతో ఆ చిన్ని కోతి పంచ్ ఆ ఒరాంగుటన్ బొమ్మనే తన తల్లిలా భావిస్తోంది. ఆ బొమ్మనే తల్లిలా హత్తుకుని నిద్రపోవడం అందరినీ కదిలిస్తోంది. జూలో ఎక్కడికి వెళ్లిన ఆ బొమ్మను వెంటబెట్టుకొని వెళుతోంది. ఆ బొమ్మ ఒడిలో పడుకొని నిద్రిస్తోంది.

దీంతో #HangInTherePunch హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచ్‌కు భారీ మద్దతు లభించింది. వేలాది పోస్టులు వైరల్ అయ్యాయి. ఇటీవల మంకీ మౌంటెన్ గుంపులోకి మళ్లీ చేర్చగా, క్రమంగా ఇతర కోతులతో కలిసిపోతోంది. సందర్శకులు పంచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జూకి తరలివస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions