Wednesday 8th July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కోవా బన్ వివాదం..చిరు వ్యాపారికి లోకేశ్ మద్దతు

కోవా బన్ వివాదం..చిరు వ్యాపారికి లోకేశ్ మద్దతు

Nara Lokesh On Kova Bun Incident | సోషల్ మీడియాలో విస్తృత చర్చలు దారి తీసిన కోవా బన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చిరు వ్యాపారికి మద్దతుగా నిలిచారు. మేడారం మహా జాతరలో భాగంగా కర్నూలుకు చెందిన షేక్ వాలి అనే చిరు వ్యాపారి కోవా బన్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. అయితే కొందరు యూట్యూబ్ యాంకర్లు అతడి స్టాల్ వద్దకు వచ్చి కోవా బన్ ఇంత తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నావు, ఇందులో ఏదైనా కలిపావా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. యాంకర్ల తీరుతో చిరు వ్యాపారి భయపడిపోయాడు. ఇందులో మతం కోణం కూడా రావడంతో ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపింది.

ఇదే సమయంలో చిరు వ్యాపారికి మద్దతుగా నెటిజన్లు నిలిచారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా షేక్ వాలికి మద్దతుగా పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే నారా లోకేశ్ సైతం స్పందించారు. సోదరుడు వాలి ఇలాంటి బాధను ఎదురుకోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి విభజిత, విద్వేషాపూరిత ప్రవర్తనకు తెలుగు సమాజంలో స్థానం లేదన్నారు. తెలుగు సమాజం ఎల్లప్పుడూ సోదర భావం, పరస్పర గౌరవం, సోదర భావంతో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే త్వరలోనే వాలిని కలిసి అతని ఫెమస్ కోవా బన్ రుచి చూడనున్నట్లు వెల్లడించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions