Wednesday 13th May 2026
12:07:03 PM
Home > తాజా > మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!

మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!

konda sushmitha book rudra

Chiranjeevi Launches ‘Rudra’ Book | తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ (Konda Murali) దంపతుల కుమార్తె కొండా సుష్మిత (Konda Susmitha) ‘రుద్ర’ అనే పుస్తకాన్ని (Rudra Book) రచించారు.

శివపురాణంలోని విశేషాలను వారికి నేటి యువతకు సులభంగా తెలియజేయాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని సుష్మిత ఈ పుస్తకాన్ని రచించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మిత పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

‘కొండా సుష్మిత చిన్న వయసులోనే శివ పురాణానికి సంబంధించిన రుద్ర అనే పేరుతో చక్కటి పుస్తకం రాసింది. నేటి జనరేషన్‌కు మన పురాణాలేంటి..? శివుడు, పార్వతి అపూర్వమైన కలయిక గురించి, లోక కల్యాణం గురించి పుస్తకంలో చాలా చక్కగా వివరించింది. ఇలాంటి యంగ్‌స్టర్స్ ఇలాంటి పుస్తకం రాయటం గొప్ప విషయం. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని.. అమ్మా నాన్నలకు పేరు తెచ్చే విధంగా మంచి రచయితగా మారాలి’ అని చిరంజీవి ఆశీర్వదించారు.  

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
saraswati anthya pushkaralu
వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions