Wednesday 13th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆరెంజ్ ఎకానమీకి నిర్మలమ్మ ప్రాధాన్యత

ఆరెంజ్ ఎకానమీకి నిర్మలమ్మ ప్రాధాన్యత

Sitharaman backs ‘Orange Economy’ | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 ఆదివారం పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు. ఇది ఆమె 9వ బడ్జెట్ ప్రసంగం. ఈ బడ్జెట్‌లో “ఆరెంజ్ ఎకానమీ”కి (Orange Economy) ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆరెంజ్ ఎకానమీ అంటే సృజనాత్మక రంగాలు Animation, Visual Effects, Gaming, Comics (AVGC), కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మీడియా, డిజైన్ వంటి రంగాలు. ఇవి సాంస్కృతికం, సాంకేతికత, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీతో ముడిపడి ఉంటాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆరెంజ్ ఎకానమీపై కీలక ప్రకటనలు చేశారు.

భారతదేశంలో Animation, Visual Effects, Gaming మరియు Comics (AVGC) రంగం వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పిన ఆమె 2030 నాటికి ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ఉద్యోగులు అవసరం అవుతారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో Indian Institute of Creative Technologies (IICT), Mumbai మద్దతుతో దేశవ్యాప్తంగా 15,000 పాఠశాలలు మరియు 500 కళాశాలల్లో AVGC Content Creator Labs ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ల్యాబ్‌ల ద్వారా యువతకు శిక్షణ, ఇన్నోవేషన్, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions