Harish Rao Repeats Ys Jagan Dailouge | వైసీపీ అధినేత వైఎస్ జగన్ డైలాగ్ ను రిపీట్ చేశారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దింతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బీఆరెస్ నేతలు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కావాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి ప్రయోగాలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా పోలీసులను వదిలిపెట్టేది లేదని కన్నెర్ర చేశారు. రిటైర్ అయినా వదిలిపెట్టేదే లేదని ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సహకరించదని చెప్పారు. సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారని వార్నింగ్ ఇచ్చారు.










