Sunday 13th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’

‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’

PM Modi congratulated Nitin Nabin on becoming the BJP National President | భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికైన విషయం తెల్సిందే. ఈ క్రమంలో స్పందించిన ప్రధాని మోదీ తాను బీజేపీ కార్యకర్తను, తన బాస్ నితిన్ నబీన్ అని పేర్కొన్నారు. కమల దళపతిగా 45 ఏళ్ల నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..కమల పార్టీలో సాధారణ కార్యకర్త కూడా అధ్యక్షుడు కాగలరని పేర్కొన్నారు. తాను బీజేపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి గర్వపడుతానని ప్రధాని చెప్పారు. పార్టీ వ్యవహారాల విషయానికి వస్తే తాను సాధారణ కార్యకర్తనే అని తెలిపిన మోదీ నితిన్ తనకు బాస్ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ నబీన్ యువతరం నాయకుడని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని, దీనికి అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు అభినందనలు అని ప్రధాని ప్రశంసించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions