Saturday 17th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఓ ప్రాణం నిలబెట్టిన డెలీవరీ బాయ్..

ఓ ప్రాణం నిలబెట్టిన డెలీవరీ బాయ్..

delivery boy saves woman life in tn

– అతడి సమయస్ఫూర్తికి నెటిజన్ల హాట్సాఫ్!

Delivery Boy Saves Woman Life | తమిళనాడులో ఒక డెలివరీ బాయ్ (Tamilnadu Delivery Boy) చేసిన పనికి అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. సాధారణంగా మొదలైన ఒక డెలివరీ, చివరకు ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టింది.

ఆ డెలివరీ బాయ్ కి రాత్రి సమయంలో మూడు ప్యాకెట్ల ఎలుకల మందు (Rats Poison) ఆర్డర్ వచ్చింది. ఆర్డర్‌ను తీసుకుని అడ్రస్ కు వెళ్లిన అతనికి అక్కడ పరిస్థితి కాస్త అనుమానాస్పదంగా తోచింది. ఇంటి తలుపు తీసిన మహిళ తీవ్రంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో కనిపించింది.

ఆమె స్థితిని గమనించిన డెలివరీ బాయ్ ఆమెతో మృదువుగా మాట్లాడి, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే తానకు ఏ హాని చేసుకునే ఉద్దేశం లేదని ఆమె చెప్పింది. అయినప్పటికీ డెలీవరీ బాయ్ కు నమ్మకం కుదరలేదు.

కాసేపు మాట్లాడుతూ అక్కడే ఉండి ఆమెతో సానుభూతిగా మాట్లాడాడు. జీవితం విలువైనదని, సమస్యలు శాశ్వతం కాదని ఆమెకు ధైర్యం చెప్పాడు. చివరకు ఆ ఆర్డర్‌ను క్యాన్సల్ చేసి, ఎలుకల మందును తిరిగి తీసుకెళ్లాడు.

ఈ ఘటనను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నెటిజన్లు అతని మానవత్వం, సమయస్ఫూర్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక సాధారణ డెలివరీ ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడిందంటూ కొనియాడుతున్నారు.

You may also like
tg high court
సరా సెలవుల్లో ఆస్తులపై ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు!
తిరుమల భక్తులకు ‘వెంకటాద్రి’ యాప్!
vc sajjanar
వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ!
25 ఏళ్ల తర్వాత అద్భుతం.. వర్షాకాలంలో నీటి పైకి తేలిన సంగమేశ్వర ఆలయం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions