Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > ఇరాన్ లో రక్తపు వర్షం..కళ్ళుచెదిరే అద్భుత దృశ్యాలు

ఇరాన్ లో రక్తపు వర్షం..కళ్ళుచెదిరే అద్భుత దృశ్యాలు

Iran’s Hormuz coast turns blood-red overnight | ఇరాన్ లో ‘బ్లడ్ రెయిన్’ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆకాశం నుండి రక్తపు వర్షం పడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింటి చెక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక ఉండే సైన్స్ ను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇరాన్ దక్షిణ భాగంలోని హోర్ముజ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతం. దీనిని రెయిన్ బో ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే రెడ్ బీచ్ చాలా ప్రసిద్ధి. ఏటా ఇక్కడ బ్లడ్ రెయిన్ ను కళ్లారా చూసేందుకు పర్యాటకులు తరలివస్తారు. ఇక్కడి మట్టిలో ఐరాన్ ఆక్సైడ్ మరియు ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షం పడితే ఆ నీటితో ఈ ఎర్రటి మట్టి కలవడంతో ఆ ప్రాంతం మొత్తం రక్తపాతం జరిగిన ప్రదేశంగా మారుతుంది.

వర్షం పడే సమయంలో మట్టితో కలిసిన నీరు సమంద్రంలోకి వెళ్లే క్రమంలో కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. రక్తం పారుతున్నట్లు కనిపించే ఎర్రటి నీరు సముద్ర గర్భంలో కలుస్తుంది. దింతో అక్కడి సముద్రపు నీరు కూడా ఎర్రగా మారుతుంది. దీనినే బ్లడ్ రెయిన్ అని అంటారు. ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన వర్షాల మూలంగా బ్లడ్ రెయిన్ దృశ్యాలు కనిపించాయి. డిసెంబర్ నెలలో వర్షాలు కురిశాయా లేదా అనేది తెలీదు అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions