Tuesday 23rd June 2026
12:07:03 PM
Home > క్రైమ్ > డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!

Digital Arrest

Woman Loses Rs. 32 Crore In Digital Arrest | డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక మహిళను మోసం చేశారు.

బెంగుళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ఆరు నెలలు కొనసాగిన ఈ ‘డిజిటల్ అరెస్ట్’ మోసంలో సుమారు రూ. 32 కోట్లు కోల్పోయారు. 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ మోసంపై ఆమె ఈ ఏడాది పోలీసుల్ని సంప్రదించడంతో కేసు నమోదైంది.

మొదట DHLలో ఎగ్జిక్యూటివ్‌గా చెప్పుకునే వ్యక్తి నుండి ఆ మహిళకు కాల్ వచ్చింది. ఆమె పేరు మీద మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్‌పోర్ట్‌ లు మరియు నిషేధిత MDMA ఉన్న ఒక పార్శిల్ ముంబైలోని కంపెనీ అంధేరీ కేంద్రానికి వచ్చిందని చెప్పారు.

వెంటనే కాల్‌ను CBI అధికారి అంటూ నటించిన వ్యక్తికి మార్చి, ఆమెపై కేసు ఉందని, ఇంటి వద్ద నేరగాళ్లు గమనిస్తున్నందున పోలీసులకు చెప్పకూడదని బెదిరించారు.

భయంతో ఆమె స్కైప్ ద్వారా నిరంతరం వీడియో కాల్‌లో ఉండాల్సి వచ్చింది. మోహిత్ హండా, రాహుల్ యాదవ్, ప్రదీప్ సింగ్ పేర్లతో తమను CBI అధికారులుగా చెప్పుకున్న మోసగాళ్లు ఆమెను నిరంతరం పర్యవేక్షించి, ఆమె నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే డబ్బు పంపాలని ఒత్తిడి చేశారు.

సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు ఆమె బ్యాంక్ వివరాలు వెల్లడించి, “జామీను”, “పన్నులు” పేర్లపై భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. మొత్తం 187 లావాదేవీల్లో రూ. 31.83 కోట్లు పంపింది. ఫిబ్రవరి 2025లో డబ్బు తిరిగి వస్తుందని మోసగాళ్లు నమ్మబలికారు.

కానీ తరువాత సంప్రదింపులు నిలిచిపోయాయి. తన కొడుకు వివాహం పూర్తయ్యాక ఆమె ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ సైబరం నేరంపై దర్యాప్తు ప్రారంభించారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions