Monday 3rd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ బ్లాస్ట్..వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్

ఢిల్లీ బ్లాస్ట్..వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్

Delhi Blast: ‘White Collar Terror Module’ | సోమవారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్ లో భారీ స్థాయిలో పేలుడు పదార్దాలు, కెమికల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దింతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.

ఇదే సమయంలో సోమవారం సాయంత్రం 6.52 నిమిషాలకు ఎర్ర కోట, చాందినీ చౌక్ మధ్య ఉన్న రోడ్డుపై సింగ్నల్ వద్ద ఒక్కసారిగా హ్యుండాయ్ ఐ20 కారులో భారీ పేలుడు సంభవించడం ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటికే 12 మందికి పైగా మృతిచెందారు. అయితే ఈ బ్లాస్ట్ ఫిదాయిన్ శైలిలో జరిగినట్లు తెలుస్తోంది.

జమ్మూ, హర్యానాలో తన సహచరులు దొరికిపోయారని భయంతోనే ఉమర్ ఈ బ్లాస్ట్ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో ఇప్పటివరకు అరెస్టైన వారు, ఢిల్లీ బ్లాస్ట్ కు కారకుడు అని అనుమానిస్తున్న ఉమర్ ఇలా అందరూ డాక్టర్లు.

జమ్మూకశ్మీర్ చెందిన డాక్టర్ అదిల్ అహ్మద్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటించాడు. ఇది నిఘా సంస్థ కంట పడింది. వెంటనే రంగంలోకి దిగిన జమ్మూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతనాగ్ మెడికల్ కాలేజీలో డాక్టర్ అదిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హాస్టల్ లో అతడి లాకర్ లో ఏకే-47 బయటపడింది. అనంతరం విచారణలో భాగంగా అతడిచ్చిన సమాచార ఆధారంగా జమ్మూ, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఫరీదాబాద్ లో ఆపరేషన్ చేపట్టారు.

ఇక్కడ డాక్టర్ ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద 2900 కేజీల పేలుడు పదార్దాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అసాల్ట్ రైఫైల్, మరికొన్ని కెమికల్స్ లభ్యం అయ్యాయి. ఇదే సమయంలో ఈ మాడ్యూల్ లో భాగమైన ఉమర్ అనే మరొక డాక్టర్ ఢిల్లీలో సోమవారం సాయంత్రం బ్లాస్ట్ కు పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సహచరులు దొరికపోవడంతో తానూ దోరికిపోతాననే భయంతోనే పేలుడుకు పాల్పడినట్లు అనే కోణంలో కథనాలు వస్తున్నాయి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions