Friday 11th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రెచ్చిపోయిన రోడ్డు టెర్ర*రిస్టు.. పదుల సంఖ్యలో మృతి!

రెచ్చిపోయిన రోడ్డు టెర్ర*రిస్టు.. పదుల సంఖ్యలో మృతి!

Jaipur Accident News | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో టిప్పర్ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో 19 మంది మరణించడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటన జరిగిన రోజే రాజస్థాన్ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

జైపూర్ లోని లోహమండి రోడ్డుపై ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ట్రక్కును నడుపుతూ వందలాది వాహనాలను ఢీ కొట్టాడు. మొత్తంగా ఐదు కిలో మీటర్ల మేర ఇలా మధ్య మత్తులో డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో భద్రతా, పోలీసు బలగాలు అక్కడి వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు మద్యం మత్తులో అమాయకుల ప్రాణాలు తీసిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి రోడ్డు టెర్రరిస్టులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions