Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > తాజా > HYD మెట్రో ప్రయాణీకులకు అలెర్ట్.. మెట్రో సమయాల్లో మార్పు!

HYD మెట్రో ప్రయాణీకులకు అలెర్ట్.. మెట్రో సమయాల్లో మార్పు!

Metro

Hyd Metro Timings Changed | హైదరాబాద్ మెట్రో రైలు (Hyd Metro Train) ప్రయాణికులకు కీలక అలర్ట్. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ 3 నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లోనూ ఈ ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.

ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు, శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అన్ని రోజుల్లోనూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మార్పు చేస్తూ ప్రకటన విడుదల చేసింది మెట్రో యాజమాన్యం.  

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
vc sajjanar
బలవంతంగా రంగులు పూస్తే.. సజ్జనర్ వార్నింగ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions