Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా దీపికా పదుకొణె’

‘తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా దీపికా పదుకొణె’

Deepika Padukone as India’s first mental health ambassador | బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను దేశంలోనే తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.

ఈ నేపథ్యంలో దీపికాను మానసిక ఆరోగ్య అంబాసిడర్ గా నియమిస్తూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో దీపికా భేటీ అయ్యారు. అనంతరం తనకు ఈ గౌరవం దక్కడం పట్ల దీపికా స్పందించారు. దీనిని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్న ఆమె కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో ప్రజారోగ్యంలో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అని అంశం ప్రాధాన్యత సంతరించుకుందని వెల్లడించారు. మానసికంగా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా దీపికా తన ‘ది లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్ ద్వారా దేశంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions