Sunday 19th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘నా తనయుడు రాజారెడ్డే వైఎస్సార్ వారసుడు’

‘నా తనయుడు రాజారెడ్డే వైఎస్సార్ వారసుడు’

YS Sharmila News | తన కుమారుడు రాజారెడ్డే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అని పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదని, పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలన్నారు.

రాజారెడ్డి అని స్వయంగా YSR నామకరణం చేశారని, తన తనయుడే రాజశేఖర్ రెడ్డి వారసుడు అని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్తే రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరి ఎవరు చెప్పారని వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS వాదికి మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు.

నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరమని టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు, జగన్ ది తెరవెనుక పొత్తు అని ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటన్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions