Sunday 20th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ విశ్వప్రయత్నాలు

మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ విశ్వప్రయత్నాలు

PM Modi refused Donald Trump’s phone calls 4 times | భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భారత్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ప్రధాని మోదీకి అసహనం గురి చేసింది, ఈ నేపథ్యంలో ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసిన మోదీ మాత్రం స్పందించలేదు.

ఈ విషయాన్ని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తొలుత ఈ విషయాన్ని జర్మనీకి చెందిన ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది, ఇది నిజమే అని తాజగా న్యూయార్క్ టైమ్స్ ధ్రువీకరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య తానే శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ట్రంప్ చాటింపు వేసుకున్నారు.

ఇది భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వహించలేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని తొలుత హెచ్చరించిన ట్రంప్ అనంతరం 50 శాతం సుంకాలతో రెచ్చిపోయారు.

మరోవైపు పాకిస్థాన్ పై ప్రేమను వ్యక్తపరిచారు. దాయాధి దేశ సైనికాధ్యక్షుడు అసిం మునీర్ తో ట్రంప్ భేటీ అయ్యారు. ట్రంప్ చర్యలు భారత ప్రభుత్వాన్ని అసహనానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఫోన్ చేసినా ప్రధాని మోదీ స్పందించలేదని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions