Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మామయ్య’

‘బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మామయ్య’

Nara Lokesh About Balakrishna | నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇటీవలే అరుదైన గౌరవం దక్కిన విషయం తెల్సిందే. సినీ రంగంలో 50 ఏళ్లుగా కథానాయకుడిగా దిగ్విజయంగా కొనసాగుతున్న బాలకృష్ణ పేరు లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో నమోదైంది.

ఈ ఘనతను పురస్కరించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ లో బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, నటి జయసుధ మరియు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ముక్కుసూటి మనిషని, నచ్చింది చేసే గుణం, నచ్చకపోతే చేసే రుద్రతాండవం అన్నింటినీ తాను గమనిస్తూనే ఉన్నానని నవ్వులు పూయించారు. తెలుగు ప్రజలకు ఆక్రోశం, ఆనందం, ఆవేశం ఏది వచ్చినా జై బాలయ్య అంటే సరిపోతుందన్నారు.

అనంతరం మాట్లాడిన నారా లోకేశ్ బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు ప్రజలకు గర్వ కారణం అని అన్నారు. చరిత్ర లిఖించాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్నా అది కేవలం బాలకృష్ణకే సొంతం అని పేర్కొన్నారు. ఆయన అందరీకి బాలయ్య కానీ తన ఒక్కడికి మాత్రమే ముద్దుల మామయ్య అంటూ నారా లోకేశ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions