Sunday 20th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ఏపీలో ఆపరేషన్ కుంకీ మొదలయ్యింది’

‘ఏపీలో ఆపరేషన్ కుంకీ మొదలయ్యింది’

‘Operation Kumki’ brings relief to farmers in border areas | రాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలయ్యిందని ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.

కుంకీ ఏనుగులు ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.

కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ అధికారులు తెలియజేశారు.

కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చిందని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందని వెల్లడించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions