Sunday 3rd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మరో ఘోర విషాదం.. కుప్పకూలిన విమానం!

మరో ఘోర విషాదం.. కుప్పకూలిన విమానం!

russia plane crash

Russia Plane Crash | ఇటీవల మనదేశంలోని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన మరిచిపోకముందే మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రష్యాకు  చెందిన ఓ విమానం కుప్పకూలింది.

ఈ ఘటనలో విమానంలోని 49 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్ 24 విమానం గురువారం రష్యాలోని బ్లాగోవెష్ చెన్క్స్ నుంచి చైనా సరిహద్దులోని టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలించగా ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. విమానం కూలిన ప్రాంతంలో శకలాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions