Jewellery Shop Robbed In Suryapet | సూర్యాపేట పట్టణంలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉండే సాయి సంతోషి బంగారం షాపులో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీకి గురయినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగలు చాలా పకడ్బందీగా చోరీ చేశారు. షాపు వెనక భాగం వైపు ఉన్న గోడకు రంధ్రం చేసి, అనంతరం గ్యాస్ కట్టర్ల సహాయంతో షటర్ ను తొలగించారు. దొంగతనానికంటే ముందే కెమెరాలను సైతం డిస్ కనెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి షాపు మూసివేశారు.
ఆదివారం సెలవు.ఈ క్రమంలో సోమవారం షాపు తెరిచి చూసేసరికే చోరీ జరిగిందని యజమాని వాపోయాడు. యజమాని కిషోర్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ నరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెక్కీ నిర్వహించే దొంగలు చోరీ చేసినట్లు తెలుస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.
మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అలాగే బంగారు ఆభరణాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.










