Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > 3 BHK కేవలం రూ. 150 మాత్రమే.. ఎక్కడో తెలుసా!

3 BHK కేవలం రూ. 150 మాత్రమే.. ఎక్కడో తెలుసా!

3 bkh movie poster

3 BHK @ Rs. 150 | కేవలం రూ. 150 రూపాయలకే 3BHK నా.. అదేంటీ 150 రూపాయలకు కనీసం అర గజం భూమి కూడా రాదు.. అలాంటిది ఏకంగా 3BHK ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఇక్కడ 3 BHK అంటే 3 బెడ్రూంల ఫ్లాట్ కాదండీ.. 3 BHK అనే సినిమా. నటుడు సిద్ధార్థ్ (Actor Siddharth) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది.

శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, మీథా రఘునాథ్, చైత్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల లో భాగంగా వెరైటీగా ఆలోచించింది చిత్ర యూనిట్. సాధారణంగా రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఫ్లాట్ అమ్మకానికి ఏర్పాటు చేసే హోర్డింగ్ ల మాదిరిగా పోస్టర్స్ రూపొందించింది. ‘3 BHK ఇప్పుడు రూ. 75 లక్షలు కాదు.. కేవలం రూ. 150 మాత్రమే’ అంటూ టికెట్ రేటు గురించి చెబుతూ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ వైరల్ అవుతోంది.

You may also like
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
varanasi
కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!
mrunal dhanush wedding ai photo
మృణాల్ – ధనుష్ పెళ్లి ఫోటో వైరల్.. అసలు నిజం ఇదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions