Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అంధ విద్యార్థుల పాట..రాష్ట్రపతి కంట తడి

అంధ విద్యార్థుల పాట..రాష్ట్రపతి కంట తడి

President Droupadi Murmu gets emotional as students sing birthday wishes to her in Dehradun | అంద విద్యార్థులు గీతాలపన చేస్తూ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఇదే సమయంలో ఆమె మూడు రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్ లో పర్యటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీస్ (NIEPVD)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, అంధ విద్యార్థులు ఆమె కోసం ఒక గీతాన్ని ఆలపించారు. గీతాలపన చేస్తూ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనితో రాష్ట్రపతి ముర్మూ కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సంగీత ప్రతిభ, మరియు ఆమె పట్ల చూపిన ఆప్యాయత ఆమెను భావోద్వేగానికి గురిచేసింది.

అనంతరం రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో సంభాషించి, వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి విద్యార్థుల గీతాలపన చేస్తున్న క్షణాలు తన గుండెల్ని హత్తుకున్నాయని పేర్కొన్నారు. NIEPVD సంస్థ దృష్టి వైకల్యం ఉన్న వ్యక్తులకు విద్య, శిక్షణ, మరియు సాధికారతను అందించే లక్ష్యంతో పనిచేస్తుంది.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions