Friday 20th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!

రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!

kohli retirement

Virat Kohli Retirement | భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ (Virat Kohli) రెడ్ బాల్ గేమ్ కు గుడ్ చెప్పారు. తాను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్టు పెట్టారు.

“నేను టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలో తీసుకెళుతుందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు పరీక్ష పెట్టింది., నన్ను గొప్పగా తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పింది” అని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

” వైట్ జెర్సీ ధరించడంలో లోతైన వ్యక్తిగత విషయం ఉంది. నిశ్శబ్దమైన ఆటతీరు, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. నేను ఈ ఫార్మాట్ నుండి వైదొలగుతున్నప్పుడు, ఇది సులభం కాదు – కానీ అది సరైందిగా అనిపిస్తుంది.

నా శక్తినంతా ధారపోశాను. ఆశించిన దానికంటే చాలా ఎక్కువ అది నాకు తిరిగి ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ కు నాతో మైదానాన్ని పంచుకున్న నా సహచరులకు, నా ప్రయాణంలో ఎదురైన ప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా, కృతజ్ఞతతో చెబుతున్నాను.

ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను. #269, సైన్ ఆఫ్,” అని అతను పోస్ట్ చేశారు కొహ్లి. తన కెరీర్ లో 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ ఆడిన కొహ్లి 46. 85 సగటు, 55.57 స్ట్రైక్ రేట్ తో 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కొహ్లి అత్యధిక స్కోరు 254 నాటౌట్. మొత్తం 1027 ఫోర్లు, 30 సిక్సులు నమోదు చేశాడు. 121 క్యాచ్ లు అందుకున్నాడు.

You may also like
రూ.131 కోట్ల నజరానా.. ఒక్కో ఆటగాడికి ఎంతంటే!
bcci
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ. ఎన్ని కోట్లంటే!
sashi tharoor
ప్రధాని తర్వాత అత్యంత కఠిన ఉద్యోగం అతడిదే: శశిథరూర్!
‘మరగుజ్జు’ వ్యాఖ్యలు..బుమ్రా కామెంట్స్ పై సఫారీ కెప్టెన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions