Sunday 6th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘డ్రోన్స్ తో పోలీసుల వేట..సారీ గయ్స్ అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్’

‘డ్రోన్స్ తో పోలీసుల వేట..సారీ గయ్స్ అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్’

Nara Lokesh News Latest | సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి లోకేశ్ తాజగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు వేటాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజి వెనుకాల బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఇద్దర్ని డ్రోన్ సహాయంతో పోలీసులు గుర్తించారు.

మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకొని, వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే మధ్య సేవిస్తున్న వారిని డ్రోన్ వెంటాడడం వైరల్ గా మారింది.

డ్రోన్ ను చూసిన మద్యం సేవిస్తున్న వారు అక్కడి నుండి పరుగందుకున్నారు. సదరు వీడియోపై మంత్రి లోకేశ్ సరదాగా స్పందించారు.

‘పొలాల మధ్యలో పరిగెడుతున్న వారిని చూస్తుంటే జాలి కలుగుతుంది. సారి గయ్స్, నేను ఎలాంటి సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే పోలీసు డ్రోన్లు వాటి విధులు నిర్వహిస్తున్నాయి’ అని లోకేశ్ పోస్ట్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions