Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > నిత్యానంద స్వామి చనిపోయారా?

నిత్యానంద స్వామి చనిపోయారా?

Nithyananda Dead? | తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు వివిధ కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద 47 ఏళ్ల వయస్సులో చనిపోయినట్లు కథనాలు వెలువడడం సంచలనం రేపుతోంది.

సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని నిత్యానంత మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఎంతవరకు నిజం ఉందొ అనేది మాత్రం తెలియాలి. అయితే కేసుల నుండి తప్పించుకునేందుకు నిత్యానందే ఈ వదంతులను వ్యాప్తి చేయించారని మరోవైపు ప్రచారం జరుగుతుంది.

తమిళనాడు లో జన్మించిన నిత్యానంద అనది కాలంలోనే విశేష ప్రాచుర్యం పొందారు. కానీ, ఓ నటితో నిత్యానంద నడిపిన రాసలీలలకు సంబంధించిన వీడియో బయటకు రావడం అప్పట్లో యావత్ దేశాన్ని కుదిపేసింది. దీనికి సంబంధించిన కేసులో అరెస్టై అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు.

కానీ 2019లో ఆశ్రమంలో మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించారని మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడు దేశం విడిచి పారిపోయాడు. అనంతరం ఈక్వెడార్‌ ఐలాండ్‌లో ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కైలాస’ను స్థాపించి సంచలనం సృష్టించారు.

గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న నిత్యానందకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే మహా శివరాత్రి నాడు జరిగిన కార్యక్రమంలో నిత్యానంద చివరిగా కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న నిత్యానంద మరణ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions