Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘సత్రాన్ని కూల్చడం బాధాకరం..సొంత నిధులతో కట్టిస్తా’

‘సత్రాన్ని కూల్చడం బాధాకరం..సొంత నిధులతో కట్టిస్తా’

Nara Lokesh News Latest | కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన ఆశ్రమ అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు.

ఈ ఘటన పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అన్నదాన సత్రాన్ని కూల్చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions