Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘సుగాలి ప్రీతి కేసుని అటకెక్కించిన బాబు..నోరు మెదపని పవన్’

‘సుగాలి ప్రీతి కేసుని అటకెక్కించిన బాబు..నోరు మెదపని పవన్’

YCP About Sugali Preeti Case | సుగాలి ప్రీతి కేసుని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) అటకెక్కించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) నోరు మెదపడం లేదని వైసీపీ విమర్శించింది.

అతి సున్నితమైన ఈ కేసుని గతంలో జగన్ సీబీఐ దర్యాప్తుకి ఆదేశించారని గుర్తుచేసింది. అంతే కాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, ప్రీతి తండ్రి రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చినట్లు జగన్ పార్టీ పేర్కొంది.

కానీ ఇప్పుడు ఆ కేసుని చంద్రబాబు తొక్కిపెట్టేస్తున్నారని మండిపడింది. ఆడబిడ్డకి అన్యాయం జరిగితే.. న్యాయం చేయాల్సింది పోయి వనరులు లేవంటూ చంద్రబాబు చేతగానిమాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యింది.

‘సుగాలి ప్రీతి కేసు విచారణపై గత ఐదేళ్లు తెగ ఊగావు కదా పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడేమైంది?’ అంటూ జగన్ పార్టీ ఎక్స్ ( X ) వేదికగా ప్రశ్నించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions