Wednesday 18th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇస్రో చరిత్రలో కీలక మైలు రాయి..!

ఇస్రో చరిత్రలో కీలక మైలు రాయి..!

ISRO

ISRO 100th Mission | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో ఓ కీలక మైలురాయిని చేరుకుంది. ఇస్రో చరిత్రలో 100 ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 29 బుధవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F15 రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.

ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే 27 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది.  ఇటీవల ఇస్రో చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ నేతృత్వంలోని తొలి మిషన్ ఇది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ద్వారా 2500 కిలోల బరువున్న నావిక్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది.

ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది.

ఈ సిరీస్లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ 11వ ప్రయోగం ఇది.

You may also like
isro eos 8
ఇస్రో ప్రయోగం సక్సెస్.. నిర్దేశిత కక్ష్యలోకి SSLV D3!
కొత్త ఏడాది ఇస్రోకు తొలి విజయం.. ఎక్స్‌ పో శాట్ ప్రయోగం విజయవంతం!
Chandrayaan 3
Chandrayaan 3: చంద్రయాన్‌ కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions