Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అప్పటి బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసిన ట్రంప్!

అప్పటి బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసిన ట్రంప్!

Donald Trump’s Inauguration 2025 | అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ ( Washington DC ) క్యాపిటల్ హిల్ ( Capitol Hill ) భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ట్రంప్ తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ( John Roberts ) ప్రమాణం చేయించారు. తన కుటుంబ బైబిల్ ( Bible ) ను మరియు 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ( Abraham Lincoln ) ప్రమాణం చేసినప్పటి బైబిల్ ను చేతిలో పట్టుకుని ట్రంప్ రెండవ సారి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ప్రసంగించారు. అమెరికా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుతుందన్నారు. అమెరికా ఫస్ట్ ( America First ) అనేదే తమ నినాదం అని స్పష్టం చేశారు. దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం కంటే ముందు ప్రెసిడెంట్ గా దిగిపోతున్న జో బైడెన్ ( Joe Biden ) దంపతులు సంప్రదాయం ప్రకారం ట్రంప్ దంపతులకు తేనేటి విందు ఇచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions