Friday 14th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కుంభమేళాలో తేనె కళ్ళ మోనాలిసా..అందానికి సోషల్ మీడియా ఫిదా

కుంభమేళాలో తేనె కళ్ళ మోనాలిసా..అందానికి సోషల్ మీడియా ఫిదా

Monalisa In Maha Kumbh Mela | ఉత్తర్ ప్రదేశ్ ( Uttarpradesh ) ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం అయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల పూజలు, బాబాల విన్యాసాలు, అఘోరాల ఆగమనంతో ఈ ప్రదేశం కోలాహలంగా మారింది.

మరోవైపు కుంభమేళాలో చిరు వ్యాపారం చేసుకుంటున్న ఓ తేనె కళ్ళ అమ్మాయి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. గత కొన్నిరోజులుగా ఎక్కడ చూసినా ఆమెకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. అలా అని ఆమె హీరోయిన్ కాదు.

పూసల దండలు అమ్ముకునే అమ్మాయి. కాటుక దిద్దిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ ( Dusky Skin ), ఎటువంటి మేకప్ హంగులు లేకుండా సింపుల్ గా కనిపిస్తూ అందర్నీ అబ్బురపరుస్తుంది ఆమె అందం. ఆమె చిరునవ్వు, అతి సాధారణ హెయిర్ స్టైల్ నెటీజన్లను మంత్రముగ్దుల్ని చేస్తుంది.

ఓ వ్యక్తి ఆమె దండలు అమ్ముతుండగా వీడియో తీసి నెట్టింట్లో పెట్టారు. క్షణాల వ్యవధిలోనే అది కాస్తా వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా ఆమె కళ్ళు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇండోర్ కు చెందిన ఈ యువతిని అందరూ మోనాలిసా భోస్లే గా సంభోధిస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions