Hyderabad Regional Passport Office | పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ.
పాస్పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారం లోపే స్లాట్ ( Slot )లభించేలా చర్యలు చేపట్టామన్నారు. పాస్పోర్ట్ పొందడానికి కనిష్ట, గరిష్ట వయసు ఏమి లేదన్నారు.
అలాగే రాష్ట్రంలో పాస్ పోర్ట్ సేవలను అందించే గరిష్ట సమయాన్ని 2024లో గణనీయంగా తగ్గించినట్లు స్నేహజ తెలియజేశారు. తత్కాల్ అపాయింట్మెంట్ల గరిష్ట పరిమితి 1-5 రోజులకు, పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా అపాయింట్మెంట్ల గరిష్ట సమయాన్ని 6-8 తగ్గించినట్టు చెప్పారు.
పాస్ పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ లో ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్ష పడినా, ప్రతికూల అంశాలున్న పాస్ పోర్ట్ జారీచేయటం కుదరదని స్పష్టం చేశారు. సందేహాల నివృత్తికి… పాస్ పోర్ట్ సమస్యలను 897794588 వాట్సాప్ నంబరులో నివేదించవచ్చని పేర్కొన్నారు.