Wednesday 17th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా..!

దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా..!

adr releases assets of chief ministers in india

Richest CMs List in India | అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం మన దేశంలోని అన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన కుటుంబం ఆస్తులు రూ. 931 కోట్లు, అప్పు రూ. 10 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.

ఆయన తర్వాత  అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఆయనకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు కూడా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30.04 కోట్ల ఆస్తులతో ఏడో స్థానంలో నిలిచారు. కాగా, రూ.15 లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు.

ఆమె తర్వాత మూడో స్థానంలో ఉన్న సిద్ధరామయ్య (కర్ణాటక) ఆస్తి రూ.51 కోట్లు. ఆయనకు రూ.23 కోట్ల అప్పుంది. రూ.55 లక్షల ఆస్తులతో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అట్టడుగు నుంచి రెండో స్థానంలో. రూ.1.18 కోట్ల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్  మూడో స్థానంలో నిలిచారు. నివేదిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions