Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > బిర్యానీ ఎప్పుడూ టాపే..జోమాటో ఇయర్ ఎండ్ రిపోర్ట్

బిర్యానీ ఎప్పుడూ టాపే..జోమాటో ఇయర్ ఎండ్ రిపోర్ట్

Zomato 2024 Year End Report | అటు జోమాటో ( Zomato ) ఇటు స్విగ్గి ( Swiggy ) రెండు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ( Online Food Delivery ) సంస్థల్లో బిర్యానీ క్రేజ్ నడుస్తోంది.

2024 ఏడాదిలో అత్యధికంగా డెలివరీ అయిన ఫుడ్ ఐటమ్ లో బిర్యానీ ( Biryani ) టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ విషయాన్ని జోమాటో తమ 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. జోమాటోలో వరుసగా తొమ్మిదవ ఏడాది బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచింది.

ఒక్క 2024లోనే దేశవ్యాప్తంగా 9 కోట్ల బిర్యానీలను డెలివరీ చేసినట్లు జోమాటో వెల్లడించింది. అంటే సెకనుకు మూడు బిర్యానీలను డెలివరీ చేసినట్లు. ఆ తర్వాత పిజ్జా ( Pizza ) సెకండ్ ప్లేస్ లో ఉంది. 5 కోట్ల 84 లక్షల పిజ్జాలను జోమాటో సంస్థ డెలివరీ చేసింది.

అలాగే 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కాఫీని డెలివరీ చేసినట్లు తెలిపింది. మరోవైపు జోమాటో డైనింగ్ సేవలను అందిస్తుంది. ఫాదర్స్ డే రోజున అత్యధికంగా టేబుళ్లు బుక్ అయినట్లు పేర్కొంది. మొత్తంగా కోటి 25 లక్షల టేబుళ్లు బుక్ అయినట్లు సదరు సంస్థ తెలిపింది.

ఆసక్తికరంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒక రెస్టారెంట్ లో రూ.5 లక్షల 13 వేలను చెల్లించినట్లు జోమాటో వెల్లడించింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions