Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత్ సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

భారత్ సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns BRICS Countries | భారతదేశం భాగంగా ఉన్న బ్రిక్స్ ( BRICS ) దేశాలకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికన్ డాలర్ కు ప్రత్యాన్మయంగా ఇతర కరెన్సీలను వినియోగించాలని భావిస్తే సుంకాల ( Tariff ) పోటు తప్పదని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మరియు ఇరాన్, యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్ దేశాల సమూహాన్ని బ్రిక్స్ గా అభివర్ణిస్తారు.

ఇటీవల రష్యాలోని కజాన్ ( Kazan ) నగరం వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో డాలర్ ( Dollar ) స్థానాల్లో బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి.

ఈ క్రమంలో డాలర్​కి ప్రత్యామ్నయంగా కొత్త కరెన్సీని సృష్టించే ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే బ్రిక్స్​ దేశాలపై 100శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

కొత్త బ్రిక్స్​ కరెన్సీ సృష్టించమని, బలమైన యూఎస్​ డాలర్​కి ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీకి మద్దతివ్వబోమని ఈ దేశాలు కట్టుబడి ఉండాలి. లేకపోతే 100శాతం టారీఫ్​లను ఎదుర్కోవాలి. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో అమ్మకాలు చేయకూడదని ట్రంప్ స్పష్టం చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions