Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోగ్యశ్రీ గోవిందా !..భగవంతుడు మిమ్మల్ని క్షమించడు

ఆరోగ్యశ్రీ గోవిందా !..భగవంతుడు మిమ్మల్ని క్షమించడు

Vijayasai Reddy On Arogya Sri | అధికార ఎన్డీయే కూటమి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాజ్యసభ ఎంపీ, వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి.

ఆరోగ్యశ్రీ లో కవర్ అయ్యే వ్యాధులను 3257 నుంచి 1949 కి తగ్గించే పదకరచన చేసి పేదల జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటున్నారా! అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘ ఆరోగ్యశ్రీ గోవిందా! అధికారంలో ఉన్న తెలుగు ద్రోహుల పార్టీ నాయకులారా! ముందున్నది మీకు మొసళ్ల పండగ. ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రరాష్ట్ర కోట్ల నిరుపేద కుటుంబాలను? ‘ అని ఆయన ప్రశ్నించారు.

‘ డబ్బు లేక చికిత్స లేక, వాళ్ళు చనిపోయినా పరవాలేదు అనుకుంటున్నారా? వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్దులు కలుగుతాయి. టీడీపీ పరిస్థితి అదే! మీరు క్షమార్హులు కారు. మిమ్మల్ని భగవంతుడు క్షమించడు. ‘ అని విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions