Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 80 ఏళ్ల రతన్ టాటాకు 30 ఏళ్ల వయసు యువకుడితో దోస్తీ..వెనక రీజన్ ఇదీ!

80 ఏళ్ల రతన్ టాటాకు 30 ఏళ్ల వయసు యువకుడితో దోస్తీ..వెనక రీజన్ ఇదీ!

Ratan Tata Shantanu Naidu Friendship | భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ( Ratan Tata ) మరణంతో యావత్ దేశం ఆయనకు నివాళి అర్పిస్తోంది. ప్రజలు రతన్ టాటా సేవలను స్మరించుకుంటున్నారు.

రతన్ టాటా మరణం ఆయన అభిమానులను, సన్నిహితులను శోక సంద్రంలో ముంచింది. ముఖ్యంగా రతన్ టాటా ఆత్మీయ నేస్తం శంతను నాయుడు ( Shantanu Naidu ) దుఖం ఆపుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో 80 ఏళ్ల రతన్ టాటా, పాతికేళ్ల వయసున్న శంతను నాయడితో స్నేహం ఆసక్తికరంగా మారింది. వీధి కుక్కలపై ప్రేమ వీరి మధ్య స్నేహ బంధానికి కారణమైంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వీధి కుక్కల సంరక్షణ కోసం రేడియం బెల్టు ( Radium Belts ) లు రూపొందించడానికి మోటో పాస్ అనే అనే సంస్థను స్థాపించాడు.

నిధుల కోసం టాటా గ్రూప్ కు లేఖ రాయడంతో మూగ జీవాలంటే అమితమైన ప్రేమ ఉన్న రతన్ టాటా ఆ యవకుడి ఆలోచన మెచ్చి శంతను నాయుడిని టాటా గ్రూప్ లోకి ఆహ్వానించారు.

అలా వారిద్దరి మధ్య పదేళ్ల స్నేహం రతన్ టాటా భుజాలపై చేతులు వేసుకునేంత వరకు వెళ్లింది. రతన్ టాటాకు స్నేహితుడు, సహాయకుడి అయిన శంతను నాయుడు ప్రస్తుతం టాటా గ్రూప్ లో మేనేజర్ గానూ విధులు నిర్వస్తిస్తున్నారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions