Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆరేళ్ల బాలికను అత్యాచారం నుండి కాపాడిన వానర సైన్యం

ఆరేళ్ల బాలికను అత్యాచారం నుండి కాపాడిన వానర సైన్యం

Monkeys Saves Six Year Old Girl From Rape Attempt | ఓ కిరాతకుడు ఆరేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేయబోయాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన కోతుల గుంపు ఆ కిరాతకుడ్ని తరమికొట్టి చిన్నారిని కాపాడాయి.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని భాఘ్పట్ ( Bhagpat ) లో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ళ పాపను దుండగుడు పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తువులు తొలగించాడు.

అత్యాచారం చేయబోతుండగా అక్కడికి చేరుకున్న వానర సైన్యం దుండగుడిని తరమికొట్టి, బాలికను కాపాడాయి. దింతో బాలికను అక్కడే వదిలేసిన కిరాతకుడు పారిపోయాడు.

ఈ ఘటన నేపథ్యంలో పొక్సో ( Pocso )చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా సమయానికి హనుమంతుడే తన సైన్యాన్ని పంపి బాలికను కాపాడాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions