Austin Harihara Kshethram | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రం ఆస్టిన్ (Austin) నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరి హర క్షేత్రం (Harihara Kshethram) లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
హరిహరక్షేత్రం నిర్వాహాకులు నెలకొల్పిన గణనాథుడి మండపానికి స్థానిక తెలుగు ప్రజలు హాజరై పూజా కార్యక్రమల్లో పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురి ఆటపాటలు, భక్తి గీతాలపనలతో పండగ కోలాహలంగా సాగింది. శృతి కొండాయి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. భరత్ కుమార్ కక్కిరేణి, కిరణ్ కుమార్ కక్కిరేణి, ప్రణయ్ తేజ తడకమళ్ల, దిలీప్ రెడ్డి బందెల, పూర్ణ కొప్పుల, ప్రదీప్ యాసం ఆధ్వర్యంలో ఈ గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శ్రీనివాస్, అన్వితా రెడ్డి, రూప, కళ్యాణి, వర్షిణి రెడ్డి, చాణక్య రెడ్డి, ఉపేందర్ రెడ్డి, నవ తేజ, చక్రపాణి రెడ్డి, మణికంఠ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అతిపెద్ద హరిహర ఆలయం..
అమెరికాలో అతిపెద్ద హరిహర ఆలయం నిర్మాణం కానుంది. టెక్సాస్ స్టేట్ ఆస్టిన్ సిటీలోని 375 కింగ్ రియా జార్జ్ టౌన్ లో అతిపెద్ద హరిహర ఆలయాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించిన ముందస్తు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ హరిహర క్రేత్రంలో శివుడు, విష్ణువు, అయ్యప్ప స్వామి సహా తదితర దేవతలను ప్రతిష్టించనున్నారు. అతి త్వరలో ఈ ఆస్టిన్ హరిహరక్షేత్రం అమెరికాలోని హిందూ సమాజానికి దర్శనమివ్వనుంది.